Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి
నవతెలంగాణ-బేగంపేట్
విభిన్న వర్గాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన హైదరాబాద్‌ను కరోనా రహిత నగరంగా మార్చడానికి అందరు కృషి చేయాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం సికింద్రాబాద్ ప్యారడైస్ వద్ద కిమ్స్ ఆస్పత్రి సహకారంతో హర్యానా నాగరిక్ సంఫ్‌ు ఏర్పాటు చేసిన మెగా కరోనా వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత టీకాలు వేసుకోవాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్ నగరంలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. విపత్కర సమయంలో హర్యానా నాగరిక్ సంఫ్‌ు ఆధ్వర్యంలో కరోనా బాధితులకు, పేద ప్రజలకు, వికలాంగులకు ఉచితంగా వైద్యం, టెలిమెడిసిన్, మెడికల్ పరికరాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, సిలిండర్లు, రక్త, ప్లాస్మా దాన శిబిరాలు, రోజు ఐదు వేల మందికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని కొనియాడారు. హర్యానా నాగరిక్ సంఫ్‌ు అధ్యక్షులు అంజనీ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో మరింత ధైర్యంగా, చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తూ కరోనా కట్టడికి తమ వంతు కషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీటీయూసీ అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జూపల్లి శ్రీనివాస్, హర్యానా నాగరిక్ సంఫ్‌ు ఉపాధ్యక్షులు పురుషోత్తం అగర్వాల్, పూర్వ అధ్యక్షులు రామ్ గోయెల్, సంఫ్‌ు నేతలు సతీష్ అగర్వాల్, సంజరు గుప్తా, సవిత గార్గ్, కవిత గుప్తా, విపిన్ సింఘానియా, అశోక్ ఆర్ ధని తదితరులు పాల్గొన్నారు.