Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కోవిడ్‌పై పోరాటంలో వ్యాక్సిన్ వేయించుకోవడం ఎంతో కీలకమని, అందరూ ధైర్యంగా టీకా వేయించుకోవాలని హిందుపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ చైర్మెన్ నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆవరణలో పలువురు రోగులు, అభిమానుల మధ్య బాలకృష్ణ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న నందమూరి బసవతారక రామారావు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులకు పండ్లు, చిన్నారులకు బహుమతులు, మిఠాయిలు, హాస్పిటల్ హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం దాతలు క్యాన్సర్ హాస్పిటల్‌కు అందజేసిన పలు విరాళాలను స్వీకరించారు. కార్యక్రమంలో దాతలు సీతారామ రాజు, అబ్బూరి శేఖర్, రుద్రరాజు శ్రీరామరాజు, స్టార్ ఫౌండేషన్ రాధాకృష్ణ, హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఆర్వీ ప్రభాకర రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ రావు, సీఓఓ జి. రవి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్స్ డాక్టర్ కల్పనా రఘునాథ్, డాక్టర్ కోటేశ్వర రావు, డాక్టర్ సెంధిల్ రాజప్ప, మెడికల్ ఆంకాలజీ విభాగపు అధిపతి డాక్టర్ ఏకే రాజు తదితరులు పాల్గొన్నారు.