Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
పేదలు కార్పొరేట్ వైద్య సేవలు పొందడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన శశాంక్‌కు మంజూరైన రూ.40వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.