Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
యంనంపేట్ సాయితేజ కాలనీకీ సీసీ రోడ్డు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు 2వ వార్డు కార్యాలయంలో స్థానిక కౌన్సిలర్ నర్రి ధనలక్ష్మీ కాశయ్యలకు గురువారం వినతి పత్రం అందజేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్ 2వ వార్డు పరిధిలోని సాయితేజ కాలనీలో 2002లో వేసిన బీటీ రోడ్డు గుంతలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. కౌన్సిలర్ ప్రత్యేక చొరవ తీసుకొని సీసీ రోడ్డు వేయించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులు వెంకటేష్, సాయి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.