Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
జిల్లా పంచాయతీ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రమణా మూర్తిని ఘట్కేసర్ మండల సర్పంచ్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఘట్కేసర్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కొర్రెముల సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షుడు కాచవాని సింగారం సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి, సర్పంచ్లు వంగూరి శివశంకర్, నీరుడి గీతశ్రీనివాస్, బద్దం గోపాల్ రెడ్డి, భైరు రమాదేవి, యాదగిరి, జలజ సత్యనారాయణ రెడ్డి, కాలేరు సురేష్ పాల్గొన్నారు.