Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారులకు మారి స్వచ్ఛంద సంస్థ చేయూత
నవతెలంగాణ-బడంగ్పేట్
కరోనా మహమ్మారికి బలైన కుటుంబం అనాథలుగా మారిన చిన్నారులను ప్రతి ఒక్కరు మానవతా హదయంతో అదుకోవాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మ రెడ్డి అన్నారు. గురువారం మేయర్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ గ్రామంలో నివాసం ఉండే సామ శ్రీనివాస్‌రెడ్డి పిల్లలు జయశ్రీ యశ్వంత్‌రెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రు లను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన జయశ్రీ (14) సంవత్సరాలు, యశ్వంత్‌రెడ్డి (12) సంవత్సరాలు ఎవరు లేక అనాథలుగా మిగిలిపోవడం బాధాకరమని అన్నారు. ఆ కుటుంబానికి చేయూతగా మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, భారత గ్రామ నవ నిర్మాణ మారి స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జయరాం, స్థానిక కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఒక డ్రై రేషన్ కిట్టు, మారి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ సిల్వెరి సాంబశివ తన సొంత డబ్బులతో ఆ కుటుంబానికి 100 కేజీల బియ్యం తన చేతులమీదుగా అందజేయడం బాధా కరంగా ఉందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశం మేరకు ఆ చిన్నారులను అదుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు.