Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో సైకిల్ అక్రిడిటేషన్ కోసం ప్రయత్నాలు ఎక్కడ ?
- సెట్ నిర్వహణకు ఓయూ,రాష్ట్ర ప్రభుత్వం కషి చేసేనా ?
నవతెలంగాణ-ఓయూ
విశ్వవిద్యాలయయాల్లో, డిగ్రీ కళాశాలలో, పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకులుగా ఎంపిక కావాలంటే ''స్టేట్ ఎల్జీబులిటీ టెస్ట్'' (టీఎస్ సెట్ ), లేదా ''యూజీసీ నెట్'' లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అలాంటి టీఎస్ సెట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు ఆరు సార్లు విజయవంతంగా నిర్వహించారు. దానిలో భాగంగా సెట్ నిర్వహణకు యూజీసీ అక్రిడిటేషన్ తప్పనిసరి పొందాల్సి ఉంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు యూజీసీ అనుమతిలో ''రెండు సైకిల్స్'' లో భాగంగా ప్రతీ సంవత్సరం ఒక మారు సెట్ చొప్పున 6 సార్లు నిర్వహించారు. ఒక్కసారిగా యూజీసీ అక్రిడిటేషన్ లభిస్తే మూడుసార్లు సేట్ నిర్వహించుకునేందుకు సౌలభ్యం ఉంటుంది.
ఇప్పటి వరకు నిర్వహించిన సెట్ వివరాలు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 సం, జులై 24న, 24 సబ్జెక్టులాలో నిర్వహించారు. దానిలో 11 వేల మంది అర్హతలు పొందారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 సం.లో నవంబర్ 24న, 24 సబ్జెట్స్లో 6,200 మంది అర్హత సాధించారు.
- ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇటు తెలంగాణ రాష్ట్రానికి కలిపి ఉమ్మడిగా ఓయూ ఆధ్వర్యం లోనే 2014 సం, ఫిబ్రవరి 15న, నిర్వహించిన సెట్లో 6,400 మంది అర్హత సాధించారు.
- 2017సం, కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జూన్ 11న, నిర్వహించిన సెట్లో 29 సబ్జెట్స్లో 3, 726 మంది అర్హత సాధించారు.
- 2018 సం, జులై 11న, నిర్వహించిన సెట్లో 3,759 మంది అర్హత సాధించారు.
- చివరిసారిగా 2019 సం, జులై 15న, నిర్వహించిన సెట్లో 2,430 మంది అర్హత సాధించారు.
వాస్తవానికి సంవత్సరానికి ఒక్కసారి సెట్ నిర్వహించవలసి ఉంటుంది కానీ మొదటి సైకిల్ 2014 పూర్తి అయింది, రెండవ సైకిల్ అక్రిడిటేషన్ కోసం జరిగిన జాప్యంతో 2015, 2016 సంవత్సరాల్లో సెట్ నిర్వహించడం జరగలేదు. ఇక ఓయూకు సెట్ నిర్వహణ కోసం యూజీసీ ఇచ్చిన రెండు సైకిల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ సెట్ నిర్వహించాలంటే ఓయూకు తప్పనిసరిగా యూజీసీ అనుమతి అక్రిడిటేషన్ పొందాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపేనా ?
టీఎస్ సెట్ నిర్వహణకు మొదట రాష్ట్ర ప్రభుత్వం సెట్ నిర్వాహణకు ''మెంబర్ సేకరేటరీ'' ని రాష్ట్ర ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. దానితో సదరు మెంబర్ సేకరేటరీ అటు డిగ్రీ, ఇటు యూనివర్సిటీలో ఎన్ని అధ్యాపకుల ఖాళీలు ఉన్నాయో దానికి అనుగుణంగా సెట్ నిర్వహించాల్సి ఉంటుంది. సదరు మెంబర్ సేకరేటరీ ఓయూ వీసీ ద్వారా సెట్ నిర్వహణ దాని ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వనికి నివేదిక సమర్పించాలి. సదరు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం యూజీసీకి రాష్ట్ర టీఎస్ సెట్ నిర్వహించడానికి ఆవశ్యకతను తెలుపుతూ యూజీసీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. పిమ్మట యూజీసీ టీమ్ సభ్యులు ఇక్కడ ఓయూలో పర్యటించి వసతులు, సౌకర్యాలు, పరిశీలించి వారు ఇక్కడ ఉన్న సౌకర్యాల ఆధారంగానే అక్రిడిటేషన్ ఇస్తారు. మరి ఓయూలో మొన్నటి వరకు 18 నెలలుగా ఇన్చార్జి వీసీ ఉండటంతో పాటు లాక్డౌన్ తోడు కావడంతో ''సెట్ 3వ, సైకిల్'' అక్రిడిటేషన్‌కు జాప్యం జరిగింది. మరి నూతన వీసీ స్పందించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి ప్రభుత్వం ద్వారా యూజీసీకి లేఖ రాస్తే యూజీసీ ఇక్కడ పర్యటిస్తే గతంలో 6సార్లు, సెట్ నిర్వహించిన 2 సైకిల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవంతో ఓయూకు అక్రిడిటేషన్ రావడం తధ్యం అయినప్పటికీ మరి ఇటు ఓయూ, అటు రాష్ట్ర ప్రభుత్వం సెట్ నిర్వాహణకు 3వ,సైకిల్లో భాగంగా యూజీసీ అక్రిడిటేషన్ కోసం ఎంత వరకు కషి చేస్తారో వేచి చూడాల్సిందే. ఇంకో వైపు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ మెంబర్ సేకరేటరీగా ప్రో.కిషన్ ఈ బాధ్యతలు స్వీకరించటానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అటు గురుకుల పాఠశాలలో, ఇటు డిగ్రీ, యూనివర్సి టీలలో,పాలిటెక్నిక్ కళాశాలాలో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న తరుణంలో తమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవతో టీఎస్ సెట్ నిర్వహించాలని అది తమకు ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందని నిరుద్యోగులు, అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.