Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
తెలంగాణ మలి ఉద్యమ విద్యార్థి అమరవీరుడు, కట్టెలమండి క్రిష్ణకాంత్ 25వ జయంతి గురువారం నాడు రసూల్‌పురా లోని కట్టెలమండి క్రిష్ణకాంత్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు జయంతి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన. కార్యక్రమానికి బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీన్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని కష్ణకాంత్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రిష్ణకాంత్ తల్లితండ్రులు కట్టెలమండి ధనరాజ్, హేమలత, తమ్ములు చంద్రకాంత్, రవికాంత్ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఛైర్మన్ టీన్ శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. కాగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న, మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్ సహకారంతో అన్నదాన కార్యక్రమం చేశారు. అలాగే శానిటైజర్, మాస్క్‌లు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, రఫీక్, రాజు బాబు, రమేష్, గోపాల్, పి.శంకర్, నాగేష్, వి రాజు, ప్రవీణ్, టీఆర్ఎస్వీ నాయకులు మిద్దె సురేష్, లోకేష్, గణేష్ పాల్గొన్నారు.