Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌తో మైనర్‌కు వేధింపులు
- నిందితుడిని అరెస్టు చేసిన రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
చెల్లెలి స్నేహితురాలు మైనర్‌ను పరిచయం చేసుకుని వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లో నివాసముంటున్న సయ్యద్ సైఫుద్దీన్ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఎస్ఎస్సీ చదువుతున్న తన చెల్లెలి స్నేహితురాలితో పరిచయం పెంచుకున్నాడు. స్నేహితురాలి అన్నకావడంతో బాధితురాలు సైతం మంచిగానే మాట్లాడేది. అయితే కొన్నాళ్లకు తన వక్రబుద్ధిని భయటపెట్టాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడంతో మైనర్ తన తల్లికి విషయం చెప్పింది. దాంతో బాధితురాలి తల్లి స్కూల్ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. సయ్యద్ సైఫుద్దీన్‌ను పిలిపించిన ప్రిన్సిపాల్ మందలించాడు. దాంతో మైనర్‌పై కక్షపెంచుకున్న నిందితుడు నకిలీ ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌ను సృష్టించాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అసభ్యకరమైన ఫోటోలు, మెసేజ్‌లు పంపిస్తున్నాడు. అంతటితో ఆగకుండా నగచిత్రాలు పంపించాలని లేకుంటే మైనర్ ఫోన్‌నెంబర్‌ను అసభ్యకరమైన వెబ్సైట్లో పెడ్తానంటూ బెదిరించాడు. రోజురోజుకు నిందితుడి వేధింపులు అధికం కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ హరినాథ్ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఇన్స్పెక్టర్ ఎం.శంకర్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.