Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్అండ్టీ మెట్రో రైల్ సీఎండీ కేవీబీ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎల్అండ్టీ మెట్రో రైల్ తమ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. సంస్థపై ఆధారపడిన ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా అపోలో, మెడికవర్ ఆస్పత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. శుక్రవారం ఉప్పల్లోని ఎల్అండ్టీ అడ్మిన్స్ట్రేటివ్ కార్యాలయం వద్ద నిర్వహించిన టీకా శిబిరాన్ని ఎల్అండ్టీ మెట్రోరైల్ సీఈవో, ఎండీ కేవీబీ రెడ్డి సందర్శించారు. మొత్తం టీకా ప్రక్రియ దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు సుమారు 600 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా టీకా ఇప్పించామని తెలిపారు. అత్యవసర వినియోగం కోసం ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా మెట్రో కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని, కోవిడ్ బారిన పడిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన మద్దతును అందిస్తున్నామని తెలిపారు.