Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 170 బాక్సుల అనుమతి లేని విత్తనాలు స్వాధీనం
- వ్యవసాయాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
నవతెలంగాణ-హయత్‌నగర్
ఎలాంటి అనుమతి లేకుండా మిర్చి విత్తనాలను నిల్వ ఉంచిన గోదాం పై ఎల్బీనగర్ ఎస్ఓటీ, హయత్ నగర్ పోలీసులు కలిసి శుక్రవారం అబ్దుల్లా పూర్మెట్ వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి ఉమ వివరాల ప్రకారం ఫణి కుమార్ అనే వ్యక్తి కొన్నేండ్లుగా మునగనూరు గ్రామంలో విత్తనాలు నిల్వ ఉంచే కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని కాల వ్యవధి ముగియడంతో అక్కడి నుంచి పసుమాముల గ్రామంలో ఉన్న కళానగర్‌లో అనుమతి కోసం ధరఖాస్తు చేసుకుని అనుమతి రాకముందే అందులో మిర్చి విత్తనాలు నిల్వ ఉంచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ విత్తనాల కేంద్రంపై దాడులు నిర్వహించారు. అందులో ఉన్న 170 బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాటి విలువ సుమారు రూ.8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.