Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక మెడికల్ ఆఫీసర్ స్వప్నికా, కరుణాదేవి ఆధ్వర్యంలో శుక్రవారం ఆశా కార్యకర్తలకు జిల్లా పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ శేషుపద్మ కొవిడ్-19 కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా శేషుపద్మ మాట్లాడుతూ మీ మీ కాలన్లీలో ఎవరైనా కోవిడ్ బారిన పడిన వ్యక్తుల దగ్గరకు వెళ్ళి నప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర త్తలు గూర్చి, కోవిడ్ బారిన పడిన వ్యక్తులకు ఎలాంటి ఆరో గ్య సలహాలు అందించాలి అని ఆశా కార్యకర్తలకు అవగా హన కల్పించారు. అందులో భాగంగా మారి సంస్థ చేస్తున్న సేవల గూర్చి కో-ఆర్డినేటర్ మాసాని వెంకన్న వివరిం చారు. సంస్థ నుంచి కోవిడ్ బారిన పేదవాళ్ళకు ఉచితంగా 11 రకాల ఆహార పదార్థాలు, ఆరోగ్యం కోసం 8 రకాల ఆరోగ్య వస్తువులు, పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికీ చరవాణి ద్వారా ప్రత్యక్షంగా కలిసి కౌన్సిలింగ్ చేస్తూ మనోధైర్యం చెబుతున్నారని తెలిపారు. మారి సంస్థ సేవలు చాలా అద్బు తంగా ఉన్నాయనీ, ఈ సేవలను ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరగడం చాలా అభినందనీయమని కొనియాడా రు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సౌందర్య లతా, నగేష్, మారి సంస్థ కార్యకర్తలు వెంకన్న, బిందు ప్రవళిక, శీరిష, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.