Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మహేశ్వరం మండలం, మంకాల్ గ్రామానికి చెందిన కామల్ల శేఖర్ వ్యవసాయం చేస్తున్నాడు. ఇతనికి ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 17 ఏండ్ల కూతురు రోహిత ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. శుక్రవారం మధ్యాహ్నం మహేశ్వరంలోని మాడల్ కళాశాలకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫొన్ చేయగా కళాశాలకు రాలేదని చెప్పారు. దీంతో బంధువులు, స్నేహితుల ఇండ్లు, చుటు పక్కల వారిని సమాచారం అడగ్గా ఆచూకీ లభించలేదు. రోహిత తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.