Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం సుభాష్‌నగర్ డివిజన్ సూరారం కాలనీ రాజీవ్‌గృహకల్ప సముదాయంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యామ్‌సన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నుంచి ప్రజలందరిని కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైరిస్క్ కేటగిరిలోని ట్రాన్స్జెండర్లకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మేడ్చల్ జిల్లాలోని ట్రాన్స్జెండర్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, ఎంహెచ్ఓ నిర్మల, కుత్బల్లాపూర్ డీసీ మంగతాయారు, మాజీ కార్పొరేటర్ జి.సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.