Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
డ్రయినేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. శుక్రవారం అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌లో నూతన డ్రయినేజీ పైపులైన్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజరుకుమార్గౌత్తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో డ్రయినేజీ పైపులైన్, తాగునీటి పైపులైన్ వ్యవస్థను ఆధునీకరించి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. లో ప్రెషర్, కలుషిత నీటి సమస్యలు పునరావృతంకాకుండా నూతన డ్రయినేజీ, తాగునీటి పైపులైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ సంతోష్, ఏఈలు కుశాల్, శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గతో పాటు స్థానిక బస్తీ వాసులు లింగారావు, పెంటం రాజు, ప్రకాష్, నాగరాజు, మణెమ్మ, లక్ష్మమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.