Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు పూర్తిగా విఫలమైయ్యిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలను నియంత్రించాలని కోరుతూ శుక్రవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల కేంద్రంలోని వరంగల్ జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంకు వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేడు దేశవ్యాప్తంగా కరోనా సంక్షోభంతో ప్రజలు అల్లాడుతున్నారని, అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేయాల్సిన సర్కారు చమురు ధరలను పెంచడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజల బాధలను అర్ధం చేసుకోని పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కందికంటి శ్రీధర్, టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మెన్ తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ కార్పొరేట్ తోటకూర అజరు యాదవ్, నాయకులు హరివర్ధన్‌రెడ్డి, వేముల మహేష్‌గౌడ్, కర్రె రాజేష్, వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, కొమ్మిడి అనురాధారాఘవరెడ్డి, శ్రీధర్, సగ్గు అనిత, ప్రవీణ్‌రెడ్డి, గోపాల్ రెడ్డి, బాణు ప్రకాష్, శ్రీకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.