Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
టీఆర్ఎస్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ అణచివేత ధోరణికి అవలంభిస్తుందని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ విమర్శించారు. ఈమేరకు శుక్రవారం షాపూర్‌నగర్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న ఆయన్ను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా ప్రచురితం చేయడాన్ని దృష్టిలో పెట్టుకుని రఘుపై అక్రమ కేసులు పెట్టి దౌర్జన్యంగా అరెస్టు చేశారన్నారు. ప్రజలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో నాయకులు బక్క శంకర్‌రెడ్డి, నట్రాజ్గౌడ్, బావిగడ్డ రవి, కేశవ్‌యాదవ్, పత్తి సతీష్, కంది శ్రీరాములు, సాయినాథ్, పున్నారెడ్డి, పులిబలరాం, దుర్యోధనరావు, రేవతిరెడ్డి, గరిగే శేఖర్, శ్రీధర్ వర్మ, శ్రీనివాస్, సునీల్ పాటిల్, సుధ, సంగీత, నల్ల ప్రసాద్, శంకర్, రమ్యా, సుశాంత్గౌడ్, కృష్ణయాదవ్, భానుచందర్, నర్సింగ్, విజరుగుప్త, నాగమణి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.