Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
సికింద్రాబాద్ నియోజక వర్గం పరిధిలో మంచి నీటి ఎద్దడిని పూర్తిగా నివారించగలిగామని, సివరేజీ సమస్యలను కూడా శాశ్వతంగా పరిష్క రించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. సితాఫల్మండీ డివిజన్ పరిధిలో రూ.34లక్షల ఖర్చుతో వివిధ ప్రాంతాల్లో సివరేజి, మంచి నీటి పైప్ లైన్ల ఏర్పాటు పనులను తీగుల్ల పద్మారావుగౌడ్ శనివారం ప్రారంభించారు. ఉప్పరి బస్తీలో రూ.11 లక్షల ఖర్చుతో సివర్ లైన్, బీదల బస్తీలో రూ.18 లక్షల ఖర్చుతో సివర్లైన్, ఎరుకల బస్తీిలో రూ.4.85 లక్షల ఖర్చుతో మంచినీటి లైన్ పనులను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తీగుల్ల పద్మారావుగౌడ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రూ.10 కోట్ల మేరకు నిధులను సేవర్ లైన్ల మార్పిడికి వినియోగించినట్లు పద్మారావుగౌడ్ తెలిపారు. జలమండలి జీఎం రమణారెడ్డి, కార్పొరేటర్ కుమారి, సామల హేమ, టీఆర్ఎస్ యవనేత తీగుల్ల రామేశ్వర్గౌడ్, అధికారులు కష్ణ, అన్విత్ కుమార్, కష్ణ మోహన్, నాయకులు పాల్గొన్నారు.