Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
చర్లపల్లి డివిజన్లో వున్న విక లాంగులు, ఒంటరి మహిళలకు ప్యూర్ సంస్థ సహకారంతో ప్రేరణ ఫౌండేషన్ చర్లపల్లి కార్పొరేట్ బొంతు శ్రీదేవి సరుకు లు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రేరణ వంటి స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిదని అభినందించారు. సరుకులు అందించిన ప్యూర్ సంస్థ ఇలా పేదలకు చేయూతనివ్వడం గొప్పవిషయం అన్నారు. ప్రేరణ ఫౌండేషన్ చైర్మన్ శరత్ సుదర్శి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సరుకులు స్పాన్సర్ చేసిన అమెరికన్ చిన్నారులకు, సహకరించిన ప్యూర్ సంస్థ సంధ్య గోళ్ళముడికి ధన్యవాదాలు చెప్పారు. ఇటువంటి పేదలను ఆదుకునేందుకు, సేవా కార్యక్రమాలు చేయడం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్, ట్రస్ట్ సభ్యులు సుదర్శి కపా, సుదర్శి టాన్య, ఇసీ నగర్ సొసైటీ కార్యదర్శి ఏవిఎస్ వర్మ, ప్రజాసంఘాల నాయకులు వెంకట్, భాస్కర్, నాగలక్ష్మి, టీిఆర్‌ఎస్ నాయకులు సత్తిరెడ్డి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.