Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
ముషీరాబాద్ నియోజకవర్గం, గాంధీనగర్ డివిజన్ పరిధిలోని జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన నమో ఐసోలేషన్ కేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ ఎ. పావని వినరు కుమార్ శనివారం సందర్శించారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు ఈ సెంటర్లో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇటీవలె ఈ కేంద్రాన్ని కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో బీజేవైఎం నగర నాయకులు ఎ.వినరు కుమార్, ఉమేష్, ఆనంద్‌రావు, లక్ష్మణ యాదవ్, అరుణ్ కుమార్, సాయి, భరత్, సంతోష్, శ్రీనుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.