Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10 లక్షల 20 వేల విలువగల సరుకులు సీజ్
నవతెలంగాణ - మీర్పేట్
దష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగ లను మీర్ పేట్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి రూ.10 లక్షల 20 వేల విలువగల సరుకులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ ఓల్డ్ మలక్‌పేట్ చెందిన తుమ్ముసాయి నందకిషోర్ అలియాస్ సత్యనారాయణ (36), వెంకటాద్రి హైట్స్, చాదర్‌ఘాట్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ రహీం అలియాస్ ఫిరోజ్(32) ఇద్దరు చిన్నప్పటి నుండి స్నేహితులు. రైస్ ట్రేడర్స్ షాపులో పనిచేసేవారు. ఆ అనుభవంతో వివిధ రకాల సరుకులతో లోడింగ్ చేసే లారీలను గమనించి మీరు ఎక్కడికి వెళ్లాలని అడిగి వారు చెప్పిన వారు తమను పంపించారని చెప్పి సరుకులతో ఉన్న లారీలను వేరే చోటుకు తీసుకెళ్లి అన్లోడింగ్ చేయించి వచ్చిన వారు వెళ్లిపోగానే అక్కడికి నుండి వేరే దాంట్లో తీసుకెళ్లి అమ్ముకునేవారు. ఇలా వేరే వేరే ప్రాంతాల్లో దష్టి మళ్లించి సరుకులను దోచుకుంటున్నారు. అసలైన ఓనర్లు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి వీరిని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వారి వద్ద ఉన్న 10 లక్షల 20 వేల రూపాయల విలువ గల 1920 కేజీల గోల్డ్ డ్రాప్ ఆయిల్, 4 టన్నుల రైస్, 1100 కేజీలు జీర, 2250 కేజీల పల్లీలు సరుకులను, రెండు మోటార్ వెహికల్ సీజ్ చేశామని, ఇద్దరిపై గతంలోనే వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, పీడీ యాక్ట్ కూడా ఉందని, ఒకసారి పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. మళ్లీ పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. మీర్పేట్ పోలీసులు చాలా కేసులను త్వరితగతిన చేధిస్తున్నందుకు అభినందిస్తూ ప్రోత్సాహకంగా రివార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, డిఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.