Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా మార్పు
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్య ఇస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మీడి యాతో మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఐదు ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశా లలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. జల్పల్లి మున్సి పాల్టీలోని మూడు ఉర్దూ మీడియం, ఒక ఇంగ్లీష్ మీడి యం పాఠశాలతో పాటు, మీర్పెట్ కార్పొరేషన్ పరిది óలోని ఒక తెలుగు మీడియం పాఠశాలలను స్థానిక ప్రజ లు, నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఇందులో క్యూబా కాలనీ, షాహీన్ నగర్, వాదే హుడా ఉర్దూ మీడియం పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి వరకు బోధించనున్నారని పేర్కొన్నారు. వీటితో పాటు కొత్తపేటలోని ఇంగ్లీష్ మీడియం, మీర్‌పేటలోని తెలుగు మీడియం ప్రైమరీ పాఠశాలలు కూడా 5 నుంచి 7వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేశామనీ, ఈ సంవత్సరం నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలుగా మారనున్నాయ న్నారు.
నేతల హర్షం..
జల్పల్లి మున్సిపాల్టీ పరిధిలోని నాలుగు, మీర్పెట్ కార్పొరేషన్లో ఒక ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికో న్నత పాఠశాలలుగా అప్ గ్రేడ్ చేయటం పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి స్థానిక ప్రజాప్రతిని ధులు, నాయకులు, ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. జల్పల్లి మున్సిపాల్టీ పార్టీ అధ్యక్షులు ఖలీఫా, వైస్ చైర్మన్ ఫర్హాన నాజ్, నాయకులు యూసుఫ్ పటేల్, సూరెడ్డి కృష్ణారెడ్డి, శంషోద్దీన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.