Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము దేశం, రాష్ట్రంలో ఏ పార్టీకీ లేదని బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్య దర్శి మంత్రి శ్రీనివాసరావు అన్నారు. శనివారం బీజేపీ సెం ట్రల్ కమిటీ సమావేశం బర్కత్‌పురలోని పార్టీ నగర కార్యాల యంలో సెంట్రల్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివా సరావు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తు న్నారని పేర్కొన్నారు. దేశం, రాష్ట్రంలో అధికారం చేపట్టే సత్తా బీజేపీకే ఉందన్నారు. సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ సంస్థాగత పరంగా బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామ న్నారు. హైదరాబాద్ మహానగరంలో బీజేపీ ఎనలేని ఆదర ణ ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధించడం తధ్యమన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న క్రమ ంలో నగరవాసులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించా లని డిమాండ్ చేశారు. జంటనగరాల్లోని నాలా పూడికతీత ప్రక్రియను మరింత వేగవంతం చేయాలనీ, నాలో పూడిక తీయడం పక్షంలో వర్షాల వల్ల వరదలు వచ్చి పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లు, కాలనీలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నగరంలోని రోడ్లు గుంతలమ యంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వెంటనే రోడ్ల మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శతి, ప్రదీప్‌రావు, కష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిసందీప్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గీతమూర్తి, బి.వెంకటరెడ్డి, కార్పొరేటర్లు కన్నె ఉమారమేష్ యాదవ్, పద్మా వెంకట్‌రెడ్డి, లక్ష్మిఅమత, తదితరులు పాల్గొన్నారు.