Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
పీడిత ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఉద్యమ నాయకుడు ఉష్కీ నరసింహులు యాదవ్ అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం గుర్తు చేసు కుంది. నిజాంను దించడానికి, దొరలను కూల్చడానికి జరిగి న తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, అమరుడు మన్నబోయిన నర్సింహులు యాదవ్ (ఉష్కీ నర్సింహులు యాదవ్ ) 106వ జయంతి వేడుకలను అడిక్మెట్ ఫ్లైఓవర్ కింద శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మన్నబోయిన కృష్ణ యాదవ్ మాట్లాడుతూ కమ్యూనిస్టుగా, కాంగ్రెస్ వాదిగా నిత్యం పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నర్సింలు యాదవ్ పని చేశారని గుర్తు చేశారు. హైద రాబాద్ నగరంలో పరిపాలన భవనాలు నిర్మించిన శ్రామి కులకు బస్తీల ఏర్పాట్లను చేయించిన చరిత్ర వారిది అన్నా రు. మాణికేశ్వర్ నగర్ నిర్మాతగా ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ధార్మిక కార్యక్రమాలను కూడా చేపట్టి కొమురెల్లి మల్లన్న దేవస్థానాల అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. ఆయన జీవితం ఈనాటి రాజకీయ నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు నర్సింలు స్మతిలో ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, విజరు యాదవ్, వెంకటే ష్ యాదవ్, భారతి, రేణుక, హేమలత, కాంగ్రెస్ నాయకు లు రాజు, బీజేపీ నాయకులు సాయికృష్ణ యాదవ్, బాబు, శేష సాయి, బాబు, టీఆర్ఎస్ నాయకులు ఎంఎల్ అడ్వకేట్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.