Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షిరిడీి సాయి సేవా సంస్థ ఆధ్వర్యం లో కుడికాల లక్ష్మీనరసయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ కుడి కాల ప్రేమ్ కిశోర్ సహకారం తో అరుణోదయ ట్రస్ట్ చిన్నా రులకు ఆదివారం అన్నదానం నిర్వహించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న డాక్టర్లకు, వారికి సహకరిస్తున్న అశావర్కర్లకు, మున్సిపల్ సిబ్బందికి పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా షిర్డీ సాయి సేవా సంస్థ చైర్మన్ గంగాధర్ చారి మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో కుడా మన కోసం పనిచేస్తున్న వారికి మా వంతుగా సహాయం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ వారి ఇంటి పరిసరాలను
శుభ్రంగా ఉంచుకోవాలని విధిగా మాస్కులు ధరించాలనే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వం సడలించిన నిబంధనలతో రోడ్లపై గుంపులుగా తిరగవద్దని అన్నారు. మాలాంటి ఏన్నో స్వచ్ఛంద సంస్థలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న కుడికాల ప్రేమ్ కిశోర్‌కు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జంగిడి శ్రీనివాస్ కురుమ, అకవరం బాలు ముదిరాజ్, దామెర రాజేంద్ర పాల్గొన్నారు