Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
చనిపోయిన, అంగవైకల్యం చెందిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు జీవో నెంబర్ 58 ద్వారా ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యం కల్పించి ఆ కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రుణపడి ఉంటామని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సాంస్కతిక కార్యదర్శి డా. చింతల రాకేశ్ భవాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు డబుల్ ఆప్షన్ అయిందన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానంలో ప్రస్తుతం ప్రతి నెల ఉద్యోగుల వేతనాల నుంచి 10 శాతాన్ని పింఛను కోసం మినహాయిం చుకుంటూ, ప్రభుత్వం తన వాటా 10 శాతాన్ని కలిపి షేర్మార్కెట్లో పెట్టుబడి పెడుతూ, ఈ నిధులపై రాబడి ఆధారంగా పింఛను ఇస్తోంది. అయితే దీని ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు నెలకు రూ.800లకు మించి పింఛను రావడం లేదు. ఈ నేపథ్యంలో కుటుంబ పింఛను సౌకర్యం కల్పించాలంటూ వీరంతా చేస్తున్న విజ్ఞప్తులను ప్రభుత్వం మన్నించింది. 2004 సెప్టెంబరు 1 తర్వాత నియమితులై.. సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పింఛను అమలు చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.
ఉద్యోగి కంట్రిబ్యూషన్ పది శాతాన్ని మినహాయిస్తే బాగుండేది
ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చే సందర్భంలో చనిపోయిన ఉద్యోగి కంట్రిబ్యూషన్ పది శాతాన్ని సరెండర్ చేయకుండా ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తేనే అందరికీ ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని అదేవిధంగా 2004 సెప్టెంబర్ 1 తరువాత నియామకంపై చనిపోయిన తరువాత పీఎఫ్ఆర్ డిఏ నుండి ఇప్పటికే డబ్బులు విత్ డ్రా చేసుకున్న సీపీఎస్ ఉద్యోగుల కుటుంబా లకు సరెండర్‌తో సంబంధం లేకుండా ఫ్యామిలీ పెన్షన్ వర్తింపచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.