Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిత్యం పేదలకు ఆహార ప్యాకెట్ల సరఫరా
- లాక్ డౌన్లో పలు సేవా కార్యక్రమాలు
- కరోనా కట్టడికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైనం
- ఆదర్శప్రాయంగా నిలుస్తున్న రామ్ నగర్ చౌరస్తా యువత
నవతెలంగాణ-రాంనగర్
కోవిడ్-19 సెకండ్ వేవ్ విజంభిస్తున్న సమయం లో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దినసరి కూలీలు దైనందిన జీవితం దుర్భరంగా తయార య్యింది. పనులు లేక కడుపార తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పేదలు, అనాథ¸లను సేవా కార్యక్రమాలతో ఆదుకుంటుంది రామ్‌నగర్ చౌరస్తా యువత రాసూరి విజేందర్, ఎలిగేటి మహేష్, కె.రవికుమార్, రాకేష్‌ల బందం. నిత్యం పేదలకు భోజనం ప్యాకెట్లను అందజేస్తున్నారు. అభాగ్యులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. రామ్‌నగర్ చౌరస్తా యువత ప్రతి సంవత్సరం ఒక కష్ట కాలంలో సేవా కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ముషీరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పన కోసం కషి చేస్తున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రజలకు సేవ విషయంలో ఏ రోజు రాజీపడ కుండా నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు
గుడిసెలలో..బస్తీలోఆకలితో అలమటి స్తున్న వారికి నిత్యావసరాల సరుకులతో పాటు మనో ధైర్యాన్ని అందిస్తూ భరోసా కల్పిస్తున్నారు. రాంనగర్ డివిజన్‌తో పాటు ముషీరాబాద్ పరిసర ప్రాంతాలలో కరోనా బాధితులు, పోలీసులు, పేద లకు ఆహార ప్యాకెట్లను అందిస్తున్నారు. కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. కరోనా విపత్తులో మేము సైతం అంటూ నిర్విరా మంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరికి మిగతా యువత కూడా చేదోడువాదోడుగా నిలిచారు. నిత్యం ఇంట్లో తయారు చేసిన భోజనాన్ని ప్యాకెట్లుగా తయారు చేసుకొని ప్రజలతో పాటు రోడ్ల పై ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్న వారికి అందజేస్తున్నారు. లాక్డౌన్ ఉన్నా... లేకపోయినా కరోనా మహమ్మారి తగ్గేవరకూ తమ సేవా కార్యక్ర మాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.