Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ నుంచి నూతనంగా ఎన్నికైన యువమొర్చా మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి పి. బాలకృష్ణ(గోపి), జిల్లా కార్యదర్శి వినరుగౌడ్ లను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పిలుపుమేరకు నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, ముందుండాలన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని సూచించారు. బీజేపీ నగర సీనియర్ నాయకులు ఎ.వినరు కుమార్, డివిజన్ అధ్యక్షుడు రత్న సాయి చంద్, ఓబీసీ మొర్చా మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు సలాంద్రి శ్రీనివాస్ యాదవ్, శ్రీకాంత్, ఉమేష్, సత్తి రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, సాయి సంతోష్, రాహుల్, కార్తీక్, సంతోష్, లక్ష్మీకాంత్, సుదేశ్ పాల్గొన్నారు.