Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచనతో వెంకటాపూర్ ఉపసర్పంచ్ కట్ట సత్యనారాయణ గౌడ్ చేపట్టిన 'పెండ్లి కానుక స్వయం పథకం' ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో పెండ్లి చేసుకునే ఆడపడుచులకు అన్నగా అండగా ఉంటూ పెండ్లి కానుక స్వయం పథకం ద్వారా రూ. 30,111 అందిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కల్యాణ లక్ష్మి స్ఫూర్తితో గ్రామంలో నేటి వరకు దాదాపు 40 మందికి పెండ్లి కానుకను అందజేశామని సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈసందర్భంగా ఆదివారం జరిగిన నీరుడి వెంకటేష్, సంధ్య దంపతుల కుమార్తె శ్రావణి, వరుడు వినరుల వివాహా వేడుకకు హాజరై పెండ్లి కానుక స్వయం పథకం ద్వారా రూ. 30,111 అందజేశారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నీరుడి లింగం, మాజీ ఉపసర్పంచ్ గడ్డి నర్సింహ్మ, నాయకులు గొంతు బాలరాజ్, నీరుడి శ్రీనివాస్, కృష్ణ, ప్రభాకర్, సురేష్, పాండు పాల్గొన్నారు.