Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అనతి కాలంలోనే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత నానావత్ పద్మానాయక్కు దక్కుతుందని, ఆమె సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఆదివారం ఘట్కేసర్ మండలం ఘణపూర్ మాజీ సర్పంచ్ నానావత్ పద్మా నాయక్ మొదటి వర్ధంతి సందర్భంగా స్వగ్రామం ఫకీర్ టెక్యా తండాలో సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డితో కలిసి ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళ సర్పంచ్‌గా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించారని, గ్రామానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈసందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు భర్త మాజీ సర్పంచ్ నానావత్ రూప్ సింగ్, కుమారుడు నానావత్ శివాజీ నాయక్‌లకు పలువురు నాయకులు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వేముల పరమేశ్వర్ గౌడ్, వార్డు సభ్యులు చిలుగూరి భాస్కర్, వడ్త్యా పవన్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు నానావత్ సురేష్ నాయక్, మాజీ ఉపసర్పంచ్ వేముల సత్తయ్య గౌడ్, నాయకులు వేముల శంకర్ గౌడ్, రామావత్ రాణీ, తాటికొండల మల్లేష్ గౌడ్, రమావత్ చందర్ సింగ్, వేముల వెంకటేశం గౌడ్, సంతోష్ నాయక్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.