Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
వృత్తి కళాకారుల జీవితాలను కరోనా విచ్ఛిన్నం చేసిందని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ డాక్టర్ కేవీరమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు ప్రాధాన్యతలు ఎన్నో ఉంటాయని, స్వచ్ఛంద సంస్థలు ఈవిపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి కళాకారులను ఆదుకోవటం అభినందనీయమన్నారు. ఆదివారం మాసబ్‌ట్యాంక్‌లోని తన నివాస కార్యాలయంలో ప్లంజెర్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జానపద కళాకారులకు చీదటలు, గజ్జెలు, డప్పులు బహుకరించారు. ఈసందర్భంగా రమణ మాట్లాడుతూ సంపద ఎందరికో ఉంటుందని, శంకర్ ప్లంజెర్రి వంటి కొందరే సేవా దృక్పథం కలిగి ఉంటారన్నారు. సంస్థ స్థాపకులు శంకర్ మాట్లాడుతూ సహకారం అందించేందుకు సంపన్నవంతులు కానవసరం లేదని హృదయంలో స్పందన ఉంటేచాలన్నారు. భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు అశ్వని సుబ్బారావు, యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, జానపద కళాకారుల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.