Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ వర్సెస్ సభ్యులు
- గడ్డిఅన్నారం మార్కెట్లో అవినీతి చైర్మెన్‌ను బర్తరఫ్ చేయాలని పెరుగుతున్న డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్లో లైసెన్స్‌ల రచ్చ నడుస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెటైన గడ్డిఅన్నారం మార్కెట్లో భారీగా అవినీతి చోటు చేసుకుంది. పాలకవర్గాన్ని తప్పు దోవ పట్టించి రూ.8కోట్లకుపైగా కుంభకోణం చేసిన మార్కెట్ కమిటీ చైర్మెన్‌ను బర్తరఫ్ చేయా లని పాలకవర్గం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. భూ కబ్జా పేరుతో ఉద్యమ నేత ఈటల రాజేం దర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు భారీగా కుంభకోణం చేసిన గడ్డిఅన్నారం మా ర్కెట్ చైర్మెన్‌ను ఎందుకు బర్తరఫ్ చేయడం లేద ని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ పెద్దలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు చైర్మెన్ అవినీతిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్‌తోపాటు ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్లో నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని వారు ్డల్లో ఓడిపోయి ఢలాీ పడిన పార్టీకి గడ్డిఅన్నారం మార్కెట్ అవినీతి మరో మచ్చగా మారింది. చైర్మెన్ బాగోతంపై రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
మార్కెట్ నేపథ్యం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న వ్యవ సాయ మార్కెట్ ఆసియాలోనే పెద్దది. పాలక వర్గం పదవీ కాలం 16 నెలలు గడిచింది. మొద టగా ఏడాదిపాటు కొనసాగే విధంగా పాలకవర్గా న్ని ఏర్పాటు చేశారు. తర్వాత మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్కెట్ కమిటీ పరిధిలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్, ఎన్టీఆర్ నగర్‌లోని వ్యవసాయ మార్కెట్, సరూర్‌నగర్‌లోని కూరగా యల మార్కెట్లు ఉన్నాయి. ఈ కమిటీలో 9 మం ది సభ్యులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వం నియ మించిన ఏడుగురు సభ్యులతోపాటు ట్రేడర్స్ నుంచి ఇద్దరు ఉంటారు. వీరితోపాటు మరో నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు, చైర్మెన్సహా మొత్తం 14 మందితో కమిటీ ఉంది. మార్కెట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కమిటీ సమా వేశంలో తీర్మానం చేయాల్సిందే.
చైర్మెన్ నిర్వాకంతోనే!
మార్కెట్ కమిటీ నిర్ణయాలను కచ్చితంగా పాలకవర్గం సమావేశంలో తీర్మానం చేయాల్సి ందే. కానీ చైర్మెన్ మాత్రం 30 లైసెన్స్ ఇస్తామనీ, వీటిలో మీకు 16 లైసెన్స్‌లు ఇస్తానని మౌఖికం గానే చెప్పినట్టు సభ్యులు చెబుతున్నారు. కానీ ఎవరికీ తెలియకుండానే 186 లైసెన్స్‌లు జారీ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కానీ 176 లైసెన్స్లే జారీ చేసినట్టు ప్రచారం జరుగు తుంది. విజిలెన్స్ అధికారులు అధికారికంగా ప్రక టిస్తే తప్పా వీటిపై స్పష్టత రాదు. దీంతోపాటు హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 97 షాపులను రెన్యూవల్ చేసినట్టు, ఖాళీగా ఉన్న నాలుగు షాపులను స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా వ్యాపారులతో కుమ్మక్కై అవకతవక లకు పాల్పడినట్టు జోరుగా ప్రచారం జోరుగు తుంది. కోల్డ్ స్టోరేజీలతోపాటు వే బ్రిడ్జి గడువు ముగిసినా పాత ఏజెన్సీనే కొనసాగించడంపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే చైర్మెన్ అండతోనే స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ అక్రమంగా లైసెన్స్‌లు జారీ చేసినట్టు విమర్శలు రావడంతో ఆయన్ను హెడ్ ఆఫీసుకు అటాచ్ చేశారు. సూపర్వైజర్ అస్లాంఖాన్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
చైర్మెన్‌ను బర్తరఫ్ చేయాలంటున్న సభ్యులు
మార్కెట్లో రూ.8కోట్లకుపైగా కుంభకోణం చేసిన చైర్మెన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని వైస్ చైర్మెన్ ముత్యంరెడ్డితోపాటు పాలకవర్గం సభ్యు లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మం త్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మె ల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి లతోపాటు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. మార్కెట్లో జరిగిన అవినీతి గురించి వివరించారు. మార్కెట్లో జరు గుతున్న పరిణామాలపై బీజేపీ సైతం ధర్నా నిర్వహించింది. చైర్మెన్‌ను బర్తరఫ్ చేయకపోతే మార్కెట్ ఆవరణలో నిరహార దీక్షలు చేస్తామని పాలకవర్గం సభ్యులు హెచ్చరిస్తున్నారు.