Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రైతుల కోసం ప్రతి గ్రామంలో గోదాంలు నిర్మించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దళ్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు గూడ ఐలయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివా రం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో పలు గ్రామాల్లో రైతులు కుప్పలుగా పోసిన వడ్ల రాశుల కేంద్రాలను సందర్శించారు. అనంతరం రైతులు ఎదుర్కొం టున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటను గ్రామాల్లోనే కొంటానని కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన నిబంధ నలు రైతుల గోస పుచ్చుకుంటుందన్నారు. వర్షానికి రాసు లుగా పోసిన వరిధాన్యం మొలకెత్తుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో రైతులు పంట నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు నిర్మిం చాలని డిమాండ్ చేశారు. రైతు బంధుతో రైతులు, ప్రజలను మోసం చేస్తున్న కెసీఆర్‌కు బుద్ది చెప్పాలన్నారు. మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలను ఓడించడానికి రైతులు ఐక్యం కావాల న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డమీది భరత్‌గౌడ్, కె.మహేష్, గోపి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.