Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంఆర్ ఎఫ్డీ చైర్మెన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆదివారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాలను పరిశీలించారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో అపోలో ఆస్పత్రి నిర్వహిస్తున్న కరోనా వాక్సిన్ టీకా డ్రైవ్ (పేయిడ్) ప్రోగ్రాంను పరిశీలించారు. వీరన్నగుట్టలో క్రితం నెల ప్రార ంభించిన డ్రైనేజీ పనులను పర్యవేక్షించి కాలనీవాసులతో చర్చించి, ఇంకా 20శాతం పనులు మాత్రమే మిగిలాయని వారి ద్వారా తెలుసుకొని, ఈఈ రాజయ్యతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సుష్మా నుంచి పెద్ద చెరువు వరకు జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పు ల విఠల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, సీనియర్ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, వెంకట్‌రెడ్డి, వీర న్నగుట్ట అధ్యక్షులు కెకెఎల్.గౌడ్, లెక్చరర్స్ కాలనీ అధ్యక్షు లు రుక్మారెడ్డి, కాలనీ నాయకులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.