Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
జగద్గిరిగుట్టలో పదుల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా లకు గురి కాకుండా ప్రభుత్వాస్పత్రిని ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కె.యేసురత్నం, కుత్బులా ్లపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఈ.ఉమామహేష్ అన్నా రు. జగద్గిరిగుట్టలో ప్రభుత్వాస్పత్రిని ఏర్పాటు చేయాలని ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పైపులైన్ రోడ్డులో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో బస్తీ దవాఖానాలు ఉన్నాయనీ, జగద్గిరిగుట్టలో లేకపోవడం భాధకరమన్నారు. కులానికో గుడి, భవనం జగద్గిరిగుట్టలో వెలిశాయనీ, దానికి ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేశారు కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాస్పత్రిని ఏర్పాటు చేయక పోవడం దారుణమన్నారు. ఈ విషయాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ప్రజా ప్రతినిధులు ఆస్పత్రి ఏర్పాటు కోసం దృష్టి సారించాలని లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్య పరిచి ఆస్పత్రి ఏర్పాటు అయ్యేలా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షులు హరినాథ్, ఏఐవైఎఫ్ కన్వీనర్ వెంకటేష్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు భాస్కర్‌చారి, సీపీఐ శాఖ కార్యదర్శి సహదేవ్‌రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సదానంద్, కె.వెంకటేష్, కృష్ణ, రాములు, స్థానిక నాయకులు చంద్రయ్య, శ్రీనివాస్ చారి, రాము, అశోక్‌రెడ్డి, యాకయ్య, నరేంద్రచారి, లింగా చారి, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.