Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
సీపీఐ రాష్ట్ర పార్టీ దిశా, నిర్దేశాన్ని అనుసరిస్తూ ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రా చారి, కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి తమ అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం పెద్ద అంబర్‌పేట ము న్సిపాల్టీ రావి నారాయణరెడ్డి కాలనీలో పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి అనంతరం నూతన కమిటీని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. రావి నారాయణరెడ్డి కాలనీ కార్యద ర్శిగా చిలుకూరి ఫుల్లయ్య, సహాయ కార్యదర్శిగా దూపం నిరంజన్‌తో పాటు 15 మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆందోజు రవీంద్రాచారి, ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ సీపీఐ అంచెలం చెలుగా ఎదుగుతూ ప్రజా సమస్యల పరిస్కారమే ఊపిరి గా పోరాడుతూ ముందుకు సాగుతోందన్నారు. పార్టీ బలో పేతానికి కార్యకర్తలు క్రియాశీలక పాత్ర నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పరిష్కారం దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉందనీ, అందుకు ప్రతి కార్యకర్త ఉద్యమ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొన్నేండ్లుగా కాలనీ కార్యదర్శిగా బాధ్య తలు చేపట్టిన నారాయణ ప్రజల్లో ఉంటూ రావి నారా యణరెడ్డి కాలనీ సంక్షేమం కోసం తన వంతుగా కృషి చేశారనీ, ఆయన సేవలు రానున్న రోజుల్లో కాలనీ వాసులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కౌన్సిలింగ్ కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్, హరిసింగ్ నాయక్, వేణు గోపాలాచారి, చిర్ర శేఖర్, బొజ్జ రాజు, అళ్ళెంకి వెంకటేష్, కాశీ, అచ్చి నారాయణ దాసరి ప్రసాద్, మహేందర్, నాగులు, దేవమ్మ, అరుణ, నవనీత, తదితరులు పాల్గొన్నారు.