Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా చేగువేరా జయంతి వేడుకలు
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్
నవతెలంగాణ-ధూల్‌పేట్/ఓయూ
ప్రపంచ విప్లవకారుడు చేగువేరా స్ఫూర్తితో యువత ఉద్యమంలోకి రావాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు కుమార్ పిలుపునిచ్చారు. డీవైఎఫ్ఐ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేగువేరా 93వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ సౌత్ జిల్లా నాయకులు కృష్ణ నాయక్, కిషన్, శ్రీను, సంతోష్, రాజేష్, నవీన్, మురారి, రాజేందర్, చిన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో..
ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ప్రపంచ విప్లవకారుడు చేగువేరా జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు గణేష్, రవి నాయక్ మాట్లాడుతూ మోటార్ సైకిల్‌పై ఆరు దేశాలు తిరిగి ప్రజలతో మమేకమై ప్రపంచ పౌరుడైన సాహస యోధుడు చేగువేరా అని కొనియాడారు. క్యూబా సోషలిస్టు నిర్మాణంలో ముఖ్యపోషించి, బొలీవియా విముక్తి కోసం గెరిల్లా యుద్ధం చేస్తూ ప్రాణాలు వదిలిన నేత అన్నారు. మానవాళి విముక్తికి విప్లవాత్మక మెడిసిన్ కావాలని కదంతొక్కిన గెరిల్లా విప్లవ యోధుడు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, నాయకులు విజరు నాయక్, రమేష్, ప్రభా, గిరిబాబు, అశోక్, భాస్కర్, శ్రీనివాస్, గంగ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.