Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్మినార్ జోన్ పరిధిలో పనులను పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి
నవతెలంగాణ - ధూల్‌పేట్
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్‌తో కలిసి సోమవారం జోన్ పరిధిలో కొనసాగుతున్న అభివద్ధి నిర్మాణ పనులను పరిశీలించారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి మీర్ ఆలం ట్యాంక్, సురం చెరువు, పల్లె చెరువులను పరిశీలించగా... కార్పొరేటర్లతో ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, పిసల్‌బండ, ఓవైసీ హాస్పిటల్ బ్రిడ్జి పనులను ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హాసన్ హఫంది, యాకుత్‌పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రితో కలిసి యాకుత్‌పురా నాల, డబీర్‌పుర నాలాలను పరిశీలిం చారు. అభివద్ధి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. పూడికతీత పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. రానున్ను భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు స్పందిచాలని ఆదేశించారు. ఈ పర్యటనలో రాజేంద్రనగర్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, మలక్‌పేట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు జగన్, రాజేందర్‌రెడ్డి, రీచా గుప్తా, అలివేలు మంగతా యారు, రజనీకాంత్ రెడ్డి ఎస్ఈ నర్సింగ్‌రావు, ఈఈలు నరేందర్‌గౌడ్, కిష్టప్ప, రాములు, టౌన్ ప్లానింగ్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.