Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నిర్దోషిగా తీర్పిచ్చిన ప్రత్యేక న్యాయస్థానం
నవతెలంగాణ-బేగంపేట్
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు మరి కొందరిపై మోపిన కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా పేర్కొంటూ నాంపల్లి 2వ సెషన్ కోర్టులో ఎంపి, ఎమ్మెల్యే కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం సోమవారం విచారణ అనంతరం తీర్పుచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఆదూరి చిన్న శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం 2020 సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రచారం నిర్వహించారని గోపాలపురం పోలీసులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు స్టీఫెన్సన్, రాజేశ్వరరావు, ఎంపి అభ్యర్ధి తలసాని సాయి కిరణ్ యాదవ్, అప్పటి మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూపలపై 171/సి, 171/ఇ, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్వాపరాలు విచారించిన నాంపల్లి 2వ సెషన్ కోర్టులో ఎంపి, ఎమ్మెల్యే కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు సోమవారం విచారణ అనంతరం సరైన సాక్ష్యాధారాలు లేకపో వడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు కేసులో పేర్కొన్న వారందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు. మంత్రి తరపున న్యాయవాదులు ఆదూరి చిన్న శ్రీనివాస్, అన్నపూర్ణలు వాదించారు.