Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
ఏఎస్ రావు నగర్ డివిజన్లో జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డిల పర్యటన సోమవారం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ఏఎస్రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌రెడ్డిలు విస్తతంగా పర్యటిం చారు. రానున్న వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకుని కాప్రా చెరువు నాలా పరీవాహక ప్రాంతాలలో ఆక్రమణకు గురైన నాలాను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష ఇటీవల జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అందుకు స్పందిస్తూ డివిజన్ పరిధిలోని రాధిక, దమ్మాయిగూడ ప్రధాన రహదారి ల్యాండ్ మార్క్ సమీపంలో కాప్రా చెరువు నాలాను దారి మళ్లించి, వెడల్పు తగ్గించి నిర్మించిన అక్రమకట్టడాలను వెంటనే తొలగించాలని జోనల్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ప్రధాన దారిలో నిబంధనలకు విరుద్ధంగా కాలువ నీటి ప్రవాహానికి అడ్డంగా నిర్మించిన బ్రిడ్జిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. తిరుమల హార్మనీ అపార్ట్మెంట్ సమీపంలోని నాలాలో కుంగిపోయిన రిటైనింగ్ వాల్ పునర్నిర్మించాలని సూచించారు. సుబ్రమణ్య నగర్ కాలనీలో నాలా 90 డిగ్రీలు మూల మలుపు తిరిగి ఉండటంతో నీటి ప్రవాహం సరళంగా లేదని కార్పొరేటర్ శిరీషరెడ్డి, జోనల్ కమిషనర్ దష్టికి తీసుకొచ్చారు. 90 డిగ్రీల మూలమలుపు ఉన్న నాలా లను అర్ధచంద్రాకారంలో పూడిక తీసి నీటి ప్రవాహం సరళంగా జరిగేలా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ కోటేశ్వరరావు, డీఈ బాలకష్ణన్, ఏఎంహెచ్ఓ డాక్టర్ మైత్రేయి, టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఈ సంతోష్‌రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రాజులు పాల్గొన్నారు.