Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని పర్యావరణ ప్రేమికుడు, సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ అన్నారు. సోమవారం సూరారం ఎక్స్ రోడ్డులోని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం రహదారిపై సుమారు 50 మంది డాక్యుమెంటరీ రైటర్లు గొడుగు చేతపట్టి వ్యక్తిగత దూరం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, రేషన్ దుకాణాలు, కూరగాయాల మార్కెట్ల వద్ద ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 నియమ నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత దూరం పాటించాలన్నారు. గొడుగులు వెంట తీసుకుని వెళ్తే రాబోయే వర్షాకాలంలో వర్షం నుంచి రక్షణతో పాటు కరోనా వైరస్ను అరికట్టేందుకు దోహదపడుతాయన్నారు.