Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెంటినరి వేడుకల ప్రారంభోత్సవ సమయంలో సుమారు రూ. 36 కోట్ల వ్యయంతో ఓయూలోని పీజీ విద్యార్థుల కోసం ఐదు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. సదరు భవన నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర కావస్తోంది. మాజీ ప్రొఫెసర్ రామచంద్రం, నాటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, మాజీ ఓఎస్డీ ప్రొ. కృష్ణరావు ప్రత్యేక శ్రద్ధతో ఆధునిక హంగులతో ఇక్కడ 500 మంది విద్యార్థులు ఉండేందుకు వసతిగృహాన్ని నిర్మించారు. ఇంకోవైపు ప్రహరీ నిర్మాణం సైతం ఇటీవలే పూర్తి చేశారు. ప్రస్తుతం ఓయూలో ఉన్న వసతి¸గృహాల్లో పలు సమస్యలను దృష్టిలో పెట్టుకుని టాయిలెట్స్, మూత్రశాలలను కొంత దూరంగా నిర్మించేలా డిజైన్ చేశారు. ఇంకోవైవు టీవీ హాల్, కిచెన్, డైనింగ్ హల్ కూడా సువిశాలంగా ఏర్పాటు చేశారు. మరీ అధునిక హంగులతో నిర్మించిన ఈవసతిగృహాన్ని నూతన వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఎప్పుడు ప్రారంభిస్తారో ? దానిని ఏ కళాశాల విద్యార్థులకు కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.