Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-కేపీహెచ్బీ
శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని సప్తగిరికాలనీలో నెలకొన్న డ్రయినేజీ సమస్యపై మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న డ్రయినేజీ ఔట్లెట్ సమస్యను పరిష్కరిస్తానన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీరాములు, ఏఈ స్వప్న, వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్, స్థానికులు, కాలనీీ వాసులు తదితరులు పాల్గొన్నారు.