Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మరోవైపు వేసవి కాలం, ఇంకో వైపు లాక్డౌన్ వెరసి రక్తం దొరకడం కష్టంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంక్ నిల్వలు అడుగంటి పోయా యి. ఎవరైనా రోగి బంధువు ముందుకొచ్చి రక్తం దానం చేస్తేనే ఆస్పత్రి వర్గాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ప్రస్తుతం కరోనా కేసుల కారణంగా చాలా మంది రక్తం దానం చేయడం లేదు. రక్తదాన శిబిరాలు ఎక్కడ కూడా నిర్వహించడంలేదు. విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులు చేపట్టడం, ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోమ్‌తో ఆఫీసులు, కళాశా లల్లో రక్తదాన శిబిరాలు జరగడం లేదు. దాతల ద్వారా సేకరించే రక్తం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌లకు అందడం లేదు. ఏడాదికి నగరంలో దాదాపు 3.20 లక్షల యూనిట్ల రక్తం అవసరం. 2.17లక్షల యూనిట్ల మేరకే అందుబాటులో ఉంటుంది. ప్రతి రెండున్నర సెకన్లకు ఒకరికి రక్తం అవసరం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేస్తోంది. రక్తదానం ఆవశ్యకతపై ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తాన్ని గ్రూపులుగా ఆవిష్కరిం చిన 'కరల్ ల్యాండ్ స్టేనర్' పుట్టిన రోజైన జూన్ 14ను 'ప్రపంచ రక్త దాతల దినోత్సవం'గా జరుపుకొంటున్నారు.
తలసేమియా బాధితులకు ఏడాదికి 24 సార్లు
తలసేమియా చిన్నారికి ఏడాదికి కనీసం 12 నుంచి 24సార్లు రక్తం ఎక్కించాల్సిందే. కొంత మందికి రెండు వారాలకు ఒకటి నుంచి రెండు యూనిట్ల రక్తం ఇస్తే కానీ వారి మనగడ కష్టంగా ఉంటుంది. ఈ సొసైటీలో దాదాపు 2,950 మంది వరకు సభ్యులున్నారు. బాధితుల అవసరాల మేరకు రక్తం అందక ప్రాణాలకు ముప్పుగా మారుతోంది.
రేర్ గ్రూప్ దొరకడం కష్టమే
రేర్ గ్రూప్ రక్తం దొరకడం చాలా కష్టంగా మారింది. ఏబీ నెగెటివ్, ఓ నెగెటివ్, బీ నెగెటివ్, ఏ నెగెటివ్ గ్రూప్ రక్తం కొరత తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఏబీ నెగెటివ్, ఓ నెగెటివ్ రక్తం కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వైద్యులు తెలిపారు. ఏ, బీ గ్రూపుల కోసం చాలా కష్టపడాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. అన్ని గ్రూపులకు చెందిన రక్తం నగరంలోని ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉండటం లేదు. స్వచ్ఛమైన రక్తం కావాలంటే దాన్ని ఎలాంటి పరిహారం ఆశించకుండా ఇచ్చే వారి నుంచే సేకరించాలని వైద్యులు తెలిపారు. రక్తదాతల్ని ఎంచుకునే సమయంలో కొన్ని కచ్చితమైన విధానాలు పాటించాలని పేర్కొన్నారు.
సగం మంది మాత్రమే
ఏడాదిలో రెండుసార్లు
ఏడాదిలో కనీసం రెండుసార్లు రక్తదానం చేయడా నికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసర ముందని వైద్యులు పేర్కొంటున్నారు. వంద మందిలో ఒకరు సంవత్సరానికి ఒకసారి రక్తం దానం చేస్తే చాలు కొరత అనేది ఉండదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. రక్తదానం చేయడానికి చాలా మంది భయపడుతుంటారు. చివరకు అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న, భార్యకు భర్తకు కూడా రక్తం దానం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వైద్యులంటున్నారు. మీ దగ్గర రక్తం ఉందేమో చూడండి, ఎంత డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అంటారే తప్ప, తమ రక్తం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రక్తదానం చేయడం వల్ల నష్టమేమీ లేదు
ఆరోగ్యంగా ఉన్న 18నుంచి 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ రక్తం దానం చేయొచ్చు. ఒక సారి రక్తదానం చేసిన వారు మూడు నెలలకోసారి ఇవ్వొ చ్చు. ఒక వ్యక్తి 168సార్లు రక్తదానం చేయొ చ్చు. రక్తదానం చేసిన వ్యక్తికి 21 రోజుల్లోనే రక్తం సమ కూరుతుంది.హెపటైటిస్ బీ,సీ, హెచ్ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్న వారి నుంచి రక్తాన్ని తీసుకోరు.
మత్తు మందులకు అలవాటు పడినవారు రక్తదానం చేయడానికి అనర్హులు
ఒకసారి రక్తం ఇచ్చాక మహిళలైతే ఆరు మాసాలు, పురుషులైతే మూడు మాసాల తర్వాతనే రెండోసారి రక్తాన్ని ఇవ్వడానికి వీలుంటుంది. దాతలకు ఎటువంటి రుగ్మతలు ఉన్నా రక్తాన్ని స్వీకరించరు.
50 యూనిట్లకుగాను 30 యూనిట్లే
తలసేమియా బాధితులకు రక్తం దొరకడం కష్టంగా మారింది. ప్రతి రోజూ 50 యూనిట్ల రక్తం అవసరం అయితే కేవలం 30 యూనిట్ల వరకు మాత్రమే సరఫరా అవుతుంది. రోజూ దాదాపు 40 మందికి రక్తమార్పిడి అవసరమవుతోంది.ఈ మేరకు దాతలు దొరకడం లేదు. సైబరాబాద్ పోలీసుల సహాయంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సేకరి స్తున్నాం. ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలాని, అలీంబేగ్, సంయుక్త కార్యదర్శి, తలసీమియా అండ్ సిక్లే సెల్ సొసైటీ సభ్యులు తెలిపారు.