Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్రావు నగర్, చర్లపల్లి డివిజన్లో విచ్చలవిడిగా షెడ్లు వేస్తున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీి పరిధిలో నూతనంగా జోనల్ స్థాయిలో ఏర్పాటుచేసిన ఎన్ఫోర్స్మెంట్ బందం కూడా పూర్తిగా విఫల మవుతున్నాయి. విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతుంటే మరోపక్క అక్రమ షెడ్లు వ్యాపారం కూడా మూడు పూలు, ఆరు కాయలు వ్యాపారం కొనసాగుతున్నది. స్థానికంగా ఉండే సిబ్బందికి, అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు ఎలాంటి సంబంధం లేదని, నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ ఫోర్స్మెంట్ సిబ్బంది చూసుకుంటారని చేతులు దులుపుకుంటున్నారు. ఏఎస్రావు నగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో భారీ ఎత్తున అక్రమ షెడ్డు నిర్మాణం కొన సాగుతున్నా పట్టించుకోవడంలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పి తప్పించుకుం టున్నారు. చర్లపల్లి డివిజన్లోని వాసవి శివనగర్ సమీపంలో కూడా షెడ్లు వేస్తున్నా పట్టించుకోవడం లేదు. చర్లపల్లి బి.యన్ రెడ్డి నగర్లో, చక్రిపురంలో అక్రమ షెడ్లు వేలుస్తున్నాయి. ఇప్పటికైనా టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పందించి షెడ్లుపైన చర్యలు తీసుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.