Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి
- బషీర్బాగ్ పరిశ్రమభవన్ ఎదుట సీపీఐ ధర్నా
నవతెలంగాణ-నారాయణగూడ
సర్కారు భూములు అమ్మడానికి తెలంగాణ రాష్ట్ర మేమీ సీఎం కేసీఆర్ సొంత జాగీర్ కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూముల వేలంపాట నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం బషీర్ బాగ్లోని పరిశ్రమ భవన్, టీి.ఎస్.ఐ.ఐ.సి కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రంలో పరిపాలన కొనసాగించడానికి ప్రభుత్వ భూములు అమ్ముకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. అటు బహిరంగ మార్కెట్ నుంచి లక్షల కోట్ల అప్పులు, ఇటు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు అమ్మినా ప్రభుత్వ ఖజానా మాత్రం ఖాళీ, ప్రజా సంక్షేమం సున్నా అని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రం, బంగారు తెలంగాణ అంటూ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసి సీఎం కేసీఆర్ తన ఆర్థిక పాపాలను, పాలనా లోపాలను కప్పిపుచ్చుకునేందుకు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూము లను అమ్మ కానికి పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ భూములు ప్రజల భూములని, వాటిని ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలి కానీ ప్రభుత్వానికి అమ్మే హక్కు లేదని అన్నారు. ప్రభుత్వ భూములను అమ్మి పాలన కొనసాగించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో ప్రభుత్వ భూముల అమ్మకాలను అడ్డుకుని, రక్షించాలని, ఇప్పుడు స్వరాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూము లను అమ్ముకుంటుంటే సహించేది లేదని, పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి భూములను రక్షించు కుంటామని హెచ్చరించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్ మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రభుత్వ భూములు అమ్మి నిధులు సమకూర్చుకోవడం ఏమిటని, ప్రభుత్వం దివాళా తీసిందా? అని ప్రశ్నిం చారు. ప్రభుత్వ భూముల వేలం వెంటనే ఉపసం హరించు కోవాలని కోరారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈ.టి.నరసింహ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేతకాని పరిపాలనవల్లే రాష్ట్ర ఖజానా ఖాళీ అయి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.శంకర్ నాయక్, కమతం యాదగిరి, ఎస్.ఏ.మన్నన్, నేర్లకంటి శ్రీకాంత్, ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరుపాక అనిల్ కుమార్, ఏ.ఐ.ఎస్.ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు బి.స్టాలిన్, సీపీఐ హైదరాబాద్ జిల్లా నేతలు ఆర్.మల్లేష్, సలావుద్దీన్, ఆరుట్ల రాజ్ కుమార్, షేక్ నదీమ్, షేక్ మహమూద్, సి.హెచ్. జంగయ్య, గ్యార నరేష్, శ్రీమాన్, హరికష్ణ తదితరులు పాల్గొన్నారు.