Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్‌పేట
ఫుట్‌పాత్‌ల వెంట మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. అలీకేఫ్ చౌరస్తా నుంచి మూసారాం బ్రిడ్జి వరకు చేపట్టనున్న ఫుట్‌పాత్‌ల ఆధునీకీకరణ పనులను మంగళవారం స్థానిక కార్పొరేటర్ విజరుకుమార్గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ఫుట్‌పాత్‌ల వెంట పూల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తామని చెప్పారు. అలీ కేఫ్ చౌరస్తా నుంచి ముసారంబాగ్ వరకు మూసీ నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 30 కోట్లు, చాధర్ ఘట్ మూసీ నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 24.50 కోట్ల నిధులను మంజూరు చేశారని చెప్పారు. పనులు త్వరలోనే చేపడతామని పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌ల ఆధునికీకరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సంతోష్, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు