Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పని చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రజక, నాయీ బ్రాహ్మణులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ నుంచి ప్రభుత్వం అందిస్తున్న సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రిలు, దోభిఘాట్లకు ఉచిత విద్యుత్‌ను ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అమలు చేయడంతో లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు రేనయ్యనాయీ, పరమేష్, సురేష్, కుమార్, సురేష్, నాగరాజు, నరేందర్, యాదగిరి పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించేలా కృషి
ప్రజల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వివిధ ప్రాంతాల నుంచి కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులు ఎమ్మెల్యేను మంగళవారం ఆయన నివాసంలో కలిసి పలు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హూలైన వారికి అందేలా తన వంతు కృషి చేస్తునన్నారు. కరోనా మహమ్మారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.