Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
వెస్ట్ జోన్ పరిధిలోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని బుధవారం డీిజీపీ ఎం.మహేందర్ రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో కలిసి హోమ్ మినిస్టర్ మహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ను ఎంతో విశాలంగా, అధునాతన సౌకర్యాలతో నిర్మించాలని సీఎం కేసీఆర్ 21 పోలీస్ స్టేషన్లను నిర్మించుటకు ప్రత్యేక నిధులు కేటాయించారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్, సనత్నగర్ నియోజకవర్గాలకు అనుసంధానమైన వెస్ట్ జోన్లోని అతిపెద్ద పోలీస్ స్టేషన్ ఎస్.ఆర్ నగర్ అని, బుధవారం విశాల వంతమైన బిల్డిండ్లో, అన్ని అధునాతన సౌకర్యాలతో పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇండియాలోనే తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొదటి స్థానంలో ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా దొరికిపోతాము అనే భయం నేరస్తులకు తెలిసిందని అన్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న సీసీ కెమెరాలు ఇండియాలో ఇతర రాష్ట్రాలలో లేవని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ప్రజలు, స్థానిక నాయకులు, వ్యాపారస్తులు పోలీసులకు ఆర్థికంగా సహాయం చేసి పూర్తిగా నేరాలు అరికట్టుటకు సహాయ సహకారాలు అందించారని అన్నారు. ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు బాగా జరిగేవని, ఇప్పుడు అలాంటి నేరాలు పూర్తిగా తగ్గిపోయాయని, అందుకు కారణం సీసీ కెమెరాలే అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ శిఖా గోయల్, షీ టీం నేర విభాగం, వెస్ట్ జోన్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ పివి.గణేష్, మరియు కార్పొరేటర్లు దేదీప్యా రావు, రాజ్ కుమార్ పటేల్, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, కొలను లక్ష్మీ బాల్రెడ్డి, అమీర్పేట మాజీ కార్పొరేటర్ శేషు కుమారి ,మరియు స్థానిక నాయకులు పోలీసు అధికారులు పాల్గొన్నారు.