Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ డీలర్ వైఖరిని నిరసిస్తూ రేషన్ షాప్ ముందు పెద్ద ఎత్తున నిరసన
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
కరోనా కష్ట కాలంలో డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్న జనాలకు మీనాక్షి నగర్‌లోని రేషన్ షాప్ డీలర్ ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తూ దాదాపు మూడు వందల రూపాయలపైనే ఇతర సరుకులు కచ్చితంగా కొనుగోలు చేయాలంటూ. కార్డుదారులకు చుక్కలు చూపిస్తున్నపట్టికీ పట్టించు కునే వారే కరువయ్యారు. ఇతర సరుకులు కొనుగోలు చేయకపోతే రేషన్ సరుకులు ఇవ్వం అంటూ సదరు రేషన్ డీలర్ దబాయిస్తున్నాడు. సదరు రేషన్ డీలర్ వైఖరిని నిరసిస్తూ మహిళలు చేస్తున్న ఆందోళనకు చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ ప్రతినిధులు సంఘీభావం తెలిపి రేషన్ డీలర్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఇకనైనా రేషన్ కార్డుదారుల పట్ల వ్యవహరిస్తున్న తీరును రేషన్ డీలర్ మార్చుకోకపోతే కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ దష్టికి పౌరసరఫరాల శాఖ అధికారుల దష్టికి చర్యల నిమిత్తం తీసుకోవడం జరుగుతుందని సీసీఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు. రేషన్ సరుకులు కాకుండా ఇతర సరుకులు తీసుకోవాలని బలవంతపెట్టనని రేషన్ డీలర్ కార్డుదారులతో బహిరంగంగా చెప్పడంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తూ చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.